ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagan bail cancel petition: జగన్ బెయిల్‌ రద్దుపై సీబీఐ కోర్టులో ముగిసిన విచారణ.. ఆగస్టు 25న తీర్పు

జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. రఘురామ పిటిషన్‌పై ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. సీబీఐ నుంచి ఇంకా సమాచారం రాలేదని.. లిఖితపూర్వక వాదనలకు మరింత సమయం కావాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఇవాళే తెలపాలని కొంతసేపు విచారణను కోర్టు వాయిదా వేసింది.

Jagan bail cancel petition
Jagan bail cancel petition

By

Published : Jul 30, 2021, 12:03 PM IST

Updated : Jul 31, 2021, 5:28 AM IST

అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు తీర్పును ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది. రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టగా సీబీఐ తరఫు న్యాయవాది మరికొంత గడువు కావాలని కోరారు. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీవెంకటేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకసారి ఎలాంటి కౌంటరు దాఖలు చేయబోమని, మరోసారి దాఖలు చేస్తామంటూ సీబీఐ కాలయాపన చేస్తోందన్నారు. మరోసారి ఈ పిటిషన్‌పై గడువు ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరిస్తూ కొంత సమయం ఇస్తూ ఆలోగా నిర్ణయం చెప్పాలని ఆదేశించారు.

అనంతరం విచారణ చేపట్టగా సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి సూచనలూ అందలేదని, అందువల్ల గతంలో కోర్టు విచక్షణ మేరకే ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ తాము దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ న్యాయవాది చెప్పారు. దీనికి న్యాయమూర్తి అనుమతించగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రిగా జగన్‌ సాక్షులను ప్రభావితం చేయగలరని, బెయిలును రద్దు చేయడానికి తగిన కారణాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. రఘురాం/భారతి సిమెంట్స్‌పై సీబీఐ కేసుతోపాటు హెటిరో, అరబిందో, ఇందూ-గృహ నిర్మాణ మండలి వ్యవహారాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులపై విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

current shock: గుంటూరు జిల్లాలో ఆరుగురు అనుమానాస్పద మృతి

Last Updated : Jul 31, 2021, 5:28 AM IST

ABOUT THE AUTHOR

...view details