ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలో అంబరాన్నంటిన ఐటీ సంబరం

నవ్యాంధ్రలో ఐటీ కాంతులు ప్రకాశిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం35వేల మందికి ఆంధ్రప్రదేశ్​లోని ఐటీ రంగం ఉపాధి అవకాశాలు కల్పించింది. లోటు బడ్జెట్ ఉన్నా... ప్రత్యేక రాయితీలు ఇచ్చే హోదా సాయం అందక పోయినా..... ఉషోదయ రాష్ట్రంలో ఐటీ రంగం పరుగులు పెడుతోంది. ఈ రంగంలో నవ్యాంధ్ర సాధించిన పురోగతిని చాటిచెప్పేందుకు ఏపీ ఎన్నార్టీ, ఐటీ ఏపీ సంయుక్తంగా ఐటీ సంబరాన్ని నిర్వహించింది.

ఐటీ ఫెస్ట్-2019

By

Published : Mar 31, 2019, 5:54 AM IST

Updated : Mar 31, 2019, 11:15 AM IST

ఘనంగా ఐటీ సంబరం
ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో పరుగులుపెడుతోందో చాటిచెప్పేందుకు ఏపీఎన్ఆర్టీ, ఐటీ ఏపీ కలిసి ఐటీ ఫెస్ట్-2019ను ఘనంగా నిర్వహించాయి. విజయవాడ కానూరులోని సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు వేల సంఖ్యలో విద్యార్థులు, ఐటీ నిపుణులు హాజరయ్యారు. 98 ఐటీ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న సంస్థలతో పాటు మంగళగిరిలో ఉన్న ఐటీ సంస్థలూస్టాళ్లను ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో ఐటీ రంగం ఎలా ఉంది, ఎన్ని సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయంపై విద్యార్థులకు అవగాహన కలిగించాయి.
ఎందుకీ కార్యక్రమం?
నవ్యాంధ్ర పక్కనున్న హైదరాబాద్, చెన్నై , బెంగళూరు ఐటీ కంపెనీలకు చిరునామాలే. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి చూపు ఆ మూడు నగరాల వైపే. అందుకే నవ్యాంధ్రలో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విస్తరిస్తున్న ఐటీ రంగంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ ఐటి ఫెస్ట్ 2019 నిర్వహించారు.
సీత చిత్రబృందం సందడి
సంబరం అంటే స్టాళ్లు, ఐటీ ముచ్చట్లు మాత్రమే ఉంటే సరిపోదు కదా.. అందుకే సినీ తారలతో విద్యార్థులను హుషారెత్తించారు. Rx100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు తేజ సందడి చేశారు. ఏప్రిల్ లో విడుదల కాబోతున్న సీత సినిమా ముచ్చట్లను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ వేడుకలోనే సీత చిత్ర టీజర్​ను విడుదల చేశారు. ఇక మ్యూజికల్ నైట్ హంగామా అంతా ఇంతా కాదు. అనుప్ రూబెన్స్ బృందం పాటలతో అలరిస్తే..... డ్యాన్స్ బృందాలు స్టెప్పులతో అదరగొట్టాయి. ధూమ్​ధామ్​గా సాగిన ఈ వేడుకలో... ఉషోదయ రాష్ట్రంలో విస్తరిస్తున్న ఐటీ రంగం కల్పిస్తున్న అవకాశాలపై యువతకు భరోసానిచ్చింది. ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు తీయకుండా స్వరాష్ట్రంలోనే ఐటీ నిపుణులుగా మారొచ్చని భరోసా కల్పించింది.
Last Updated : Mar 31, 2019, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details