తెలంగాణలో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలలో ప్రారంభమైంది. ఈ ఏడాది 9.5 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాయగా.. అధ్యాపకులు మొత్తం 55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.
తెలంగాణలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలలో ప్రారంభమైంది. ముందుగా ఇంటర్ రెండో సంవత్సరం మూల్యంకనం పూర్తి చేసి.. మొదటి సంవత్సరం పేపర్లు దిద్దనున్నారు.
తెలంగాణాలో ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
ముందుగా ఇంటర్ రెండో ఏడాది జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత మొదటి ఏడాది పేపర్లను అధ్యాపకులు దిద్దనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కు పెంచారు. విధుల్లో 15 వేల మంది అధ్యాపకులు పాల్గొంటుండగా.. ఒక్కొక్కరికి మూడు మాస్కులు, శానిటైజర్లు, పోలీసు పాస్‌లను ప్రభుత్వం అందజేసింది. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశముంది.
ఇదీ చదవండిఃశాసన ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఎదురు చూస్తాం