పెగాసస్ అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంపై షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వానికి.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఉందని.. ఇలాంటి వాటిపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని గుర్తు చేశారు. రూల్ 17కు అనుగుణంగానే మీడియాతో మాట్లాడినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని.. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇవ్వవచ్చని ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని... ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెబుతున్నాయని ఏబీవీ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదన్న ఆయన... తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని స్పష్టంచేశారు. మీడియా సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ను కూడా వివరణలో ప్రస్తావించారు.
ABV Comments: 'తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా' - ఏబీ వెంకటేశ్వరరావు వార్తలు
ABV Reply: ప్రభుత్వం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తాను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణలో పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు