ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరంలో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో గేటుకు 2 హెడ్రాలిక్ సిలిండర్ల చొప్పున బిగించేలా ప్రణాళికను రూపొందించారు.

పోలవరంలో హైడ్రాలిక్ సిలెండర్ల బిగింపు
polavaram project

By

Published : Feb 22, 2021, 8:24 PM IST

పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. స్పిల్ వేలోని రేడియల్ గేట్లకు మొదటి సిలిండర్​ను జర్మనీ నిపుణులు అమర్చారు. జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలిండర్లను జలవనరుల శాఖ దిగుమతి చేసుకుంది. ఒక్కో గేటుకు 2 హైడ్రాలిక్ సిలిండర్ల చొప్పున బిగింపునకు ప్రణాళిక తయారు చేశారు. 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లును అధికారులు అమర్చనున్నారు. 17.3 మీటర్ల పొడవైన ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 20 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details