పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో జైలు నుంచి విడుదలయ్యారు. హైదరాబాద్ చేరుకున్నారు. గత ఏడాది జులైలో సెర్బియాలో రస్ ఆల్ ఖైమా సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన్ను సెర్బియా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నిర్బంధం చెల్లదని ఆ దేశ సుప్రీం కోర్టు.. ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ కారణంగా.. జైలు నుంచి విడుదలైన నిమ్మగడ్డ.. తెలంగాణకు చేరుకున్నారు. అధికారులు ఆయన్ను నేరుగా క్వారంటైన్‌కు తరలించారు. కరోనా విస్తృతి ఆందోళనల నేపథ్యంలో పరీక్షించారు.
హైదరాబాద్‌కు నిమ్మగడ్డ ప్రసాద్... క్వారంటైన్‌కు తరలింపు
రస్ ఆల్ ఖైమా ఫిర్యాదుతో గత ఏడాది జులైలో సెర్బియాలో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్.. జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన నిర్బంధం చెల్లదని సెర్బియా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
నిమ్మగడ్డ ప్రసాద్‌ను క్వారంటైన్‌కు తరలించిన ఎయిర్పోర్ట్ అధికారులు