మొదటి విడత పట్టణాలు, నగరాల్లో..
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26న 15,03,801 ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం కింద రానున్న నాలుగేళ్లలో 27 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి విడత నిర్మించే 15 లక్షల ఇళ్లపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వీటిని లబ్ధిదారే ఇల్లు నిర్మించే (బీఎల్‌సీ) పథకం కింద పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల్లో కడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనిస్తాయి. ఒక్కో ఇంటికి కేంద్రం రూ.లక్షన్నర సాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే రాయితీపై స్పష్టత రావాల్సి ఉంది.