దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాద్ సోదరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు ధ్రువీకరించింది. ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్ లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా తేల్చింది. దర్భంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న పార్సిల్ బాంబు పేలుడు జరిగింది. సికింద్రాబాద్ నుంచి పార్సిల్ వెళ్లినట్లు గుర్తించింది. దేశవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం చేసేలా ఎల్ఈటీ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.
మహ్మద్ నసీర్ ఖాన్ 2012లో పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని ఎన్ఐఏ తెలిపింది. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో నసీర్ శిక్షణ పొందాడని, సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడని వెల్లడించింది. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్భంగా రైల్లో పార్సిల్ పంపారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. రైలులో పేలి మంటలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగేలా కుట్ర చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. నసీర్, ఇమ్రాన్ పాక్‌లో లష్కరేతొయిబా ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారని, నిందితులను లోతుగా ప్రశ్నించి భారీ కుట్రను ఛేదించాల్సి ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసింది.
నకిలీ చిరునామాతో...