రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,94,536కి చేరింది. కొవిడ్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో వైరస్‌తో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,193కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 492 మందికి మహమ్మారి
రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 492 మందికి సోకిన మహమ్మారి
17:18 March 23
కొత్తగా 492 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 256 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,84,727కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,616 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1,48,05,335 కరోనా శాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 168 మందికి కరోనా బారిన పడ్డారు.
ఇదీ చదవండి:
Last Updated : Mar 23, 2021, 6:23 PM IST