కట్టుకున్న భర్తపై కాలుతున్న వేడి నూనె, కారం చల్లి భార్య, అతని కూతురు పరారైన ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. హుస్నాబాద్‌కు చెందిన సదయ్య, రజిత గత కొంతకాలంగా హైదరాబాద్ నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట దీనబంధు కాలనీలో నివాసముంటున్నారు. సదయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా రజిత గత నెలలో భర్తను వదిలి ఆమె పుట్టింటికి వెళ్లింది.
తెలంగాణ: భర్తపై వేడి నూనె, కారం చల్లిన భార్య... సహకరించిన కూతురు... - తెలంగాణ తాజా వార్తలు
కట్టుకున్న భర్తపై వేడి నూనె, కారం చల్లి పరారైంది ఓ ఇళ్లాలు. కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా తల్లి చేసే పనికి సహకరించింది బాధితుడి కూతురు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ: భర్తపై వేడి నూనె, కారం చల్లిన భార్య... సహకరించిన కూతురు...
ఒక వారం తరువాత తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ... ఆమె భర్తకు ఆహారం సరిగ్గా పెట్టేది కాదు. యథావిధిగా వ్యాపారానికి వెళ్లిన సదయ్య మధ్యాహ్నం వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఎంత పిలిచినా గేటు తీయకపోవడంతో పక్కింటి పైనుంచి తన ఇంట్లోకి వెళ్లాడు. దాంతో ఆయనపై వేడి వేడి నూనె, కారం చల్లి తల్లి కూతురు పరారయ్యారని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.