గుంటూరు జిల్లా బాపట్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమపై దాడి ఘటన మీద.. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. తెదేపా నేతలు .. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించారని ఆరోపించారు. దాడికి కారణమైన వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. దాడి చేసిన కిషోర్, గోపి, నాగరాజు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారనీ... బొండా ఉమ, బుద్దా వెంకన్నను పోలీసులు సురక్షితంగా తరలించారని చెప్పారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా తెదేపాకు దొరకడం లేదని అన్నారు. అందుకే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న ఉద్దేశంతోనే తెదేపా నేతలు అలజడి సృష్టించారని ఆరోపించారు. సున్నిత ప్రాంతమైన పల్నాడుకు.. గుంటూరు జిల్లా నాయకులను పంపించకుండా.. కృష్ణా జిల్లా నేతలను ఎందుకు పంపించారని ప్రశ్నించారు. కనీసం ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేవారని అన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
'మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల నిర్వహణ'