ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు విచారణ వాయిదా - వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు విచారణ వాయిదా

విశాఖ వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఆయనను మరో ఆసుపత్రికి తరలించాలన్న వ్యాజ్యంపై విచారణను కోర్టు.. సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

hicourt hearings postponed on doctor sudhakar issue
వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు విచారణ వాయిదా

By

Published : Jun 4, 2020, 12:40 PM IST

Updated : Jun 4, 2020, 3:06 PM IST

విశాఖ వైద్యుడు సుధాకర్​ను మానసిక చికిత్సాలయం నుంచి మరో ఆసుపత్రికి మార్చాలని వేసిన పిటిషన్​పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కోర్టు సెలవుల తర్వాత తదుపరి విచారణ ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న మానసిక ఆస్పత్రి నుంచి సుధాకర్​ను మార్చాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది శ్రవణ్​ కుమార్​ న్యాయస్థానాన్ని కోరారు. వైద్యుడి మానసిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని ప్రాథమికంగా సర్టిఫికెట్ ఉన్నప్పుడు... మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్​ సమక్షంలో కానీ, స్థానిక న్యాయవాది సమక్షంలో కానీ పిటిషన్​పై ఆయన సంతకం చేశారా..? అని పిటిషనర్​ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆ వివరాలను పిటిషన్​లో పొందుపరచలేదని.. టైపోగ్రాఫికల్​ తప్పులు జరిగాయని.. వీటిని సరిదిద్దుకుంటామని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

వైద్యుడు సుధాకర్​ను వేరే ఆసుపత్రికి తరలించాలని ఆయన తల్లి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మానసిక ఆస్పత్రిలో చికిత్సపై వారంతా అనుమానం వ్యక్తం చేశారు. అందుతున్న చికిత్సపై సుధాకర్​లో భయాందోళన మొదలైందని తెలిపారు. విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్​కు వైద్యుడు సుధాకర్ లేఖ కూడా రాశారు. 6వ వార్డు చీఫ్​గా ఉన్న డాక్టర్ రామిరెడ్డి గత 15 రోజులుగా ఎలాంటి వైద్యం అందించటం లేదని.. చిరాకు తెప్పిస్తున్నారని ఆరోపించారు. చికిత్స కోసం మరో యూనిట్​కు తరలించాలని లేఖలో కోరారు.

ఇవీ చదవండి:

పొంచివున్న ప్రమాదం... ముందే మేల్కొంటే మంచిది..!

Last Updated : Jun 4, 2020, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details