ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2,22,406 క్యూసెక్కులు వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 849.1 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 78.03 టీఎంసీలుగా నమోదైంది.
శ్రీశైలానికి వరద ప్రవాహం...849 అడుగులకు నీటిమట్టం
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 849.1 అడుగులకు చేరగా... 78.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
flood water release to Srisailam project
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి