ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో అర్ధరాత్రి జోరు వాన.. జలమయమైన రోడ్లు.. - Hyderabad rains

Rain in Hyderabad: హైదరాబాద్​ నగరంలో చాలా చోట్ల రాత్రి పూట ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 11 గంటలకు మొదలైన వర్షం.. తెల్లవారుజాము వరకు కురిసింది. భారీ వర్షం కారణంగా.. రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

heavy-rain-in-hyderabad
హైదరాబాద్​లో అర్ధరాత్రి జోరు వాన

By

Published : Jun 21, 2022, 12:31 PM IST

Rain in Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. బేగంపేట, ఎర్రగడ్డ, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, అమీర్​పేట, నాగారం, షేక్​పేట, గోల్కొండ, టోలీచౌకి, మెహాదీపట్నం, బోయిన్‌పల్లి, అల్వాల్‌, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, ప్యారడైజ్‌, చిలకలగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి పదకొండు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు పడింది.

హైదరాబాద్​లో అర్ధరాత్రి జోరు వాన

ఒక్కసారిగా వర్షం రావడంతో రహదారులపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్వాల్​లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details