రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని అదే రాష్ట్రంలో ఎస్ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. నీలం సాహ్నిపై రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని పిటిషనర్ కోర్టుకి వివరించారు. ఈ వాదనలకు సంబంధించి ఎస్ఈసీ నీలం సాహ్ని కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. వచ్చే నెల 2లోపు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.