రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు 90కి పైగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లనూ నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్ విచారణ చేపట్టనుంది. వ్యాజ్యాలపై రోజువారీ విచారణ జరగనుంది. కొవిడ్ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతుల్లో కేసులను విచారిస్తున్నారు.
నేడు రాజధాని వ్యాజ్యాలపై.. హైకోర్టు విచారణ
రాజధానికి సంబంధించిన కేసులపై నేడు హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.
గతేడాది జనవరిలో సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణపై మొదటిసారి జస్టిస్ జేకే మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు రైతుల తరఫు న్యాయవాదుల వాదనలనును పూర్తిగా వినిపించారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు. జస్టిస్ జేకే మహేశ్వరీ ఈ ఏడాది జనవరిలో బదిలీ కావటంతో విచారణ నిలిచిపోయింది. తర్వాత హైకోర్టు సీజేగా అరూప్ కుమార్ గోస్వామి రావటంతో మరోసారి ఆయన ముందుకు విచారణకు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 13న విచారించారు. నవంబర్ 15 తదుపరి విచారణ వాయిదా వేశారు. దీంతో నేటి నుంచి రోజువారీ విచారణను ప్రారంభించనున్నారు.
సీఆర్డీఏ రద్దు, కార్యాలయాల తరలింపు అంశాలపై రైతులు 697 రోజుల నుంచి దీక్ష చేపడుతున్నారు. గతంలో విచారణ జరిగిన తర్వాత అనుబంధ పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. అంశాల వారీగా పిటీషన్లను విచారించాలని గతంలోనే ధర్మాసనం నిర్ణయించింది. రైతుల తరపు న్యాయవాదులు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై వరుసగా వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ రోజు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి:SZC meeting: భేటీలతో రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం: అమిత్ షా