తెలంగాణలో....ఓ పక్క పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలు నిర్వహించి ప్రజలను, అధికారులను భాగస్వామ్యం చేసి అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల సర్వసభ్య సమావేశంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఓవైపు సర్వసభ్య సమావేశం... మరోవైపు ఫోన్లో కాలక్షేపం
అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఫోన్ అరక్షణం దగ్గర లేకపోతే తోచదు. ఏ పని చేస్తున్నా... చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్‌తో కాలక్షేపం చేస్తే పర్లేదు. కానీ ఏకంగా మండల సర్వసభ్య సమావేశంలో అధికారులే చరవాణీలు వినియోగిస్తే? ప్రజల కోసం శ్రమించాల్సిన అధికారులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే?
time-pass
సమావేశంలో ఓ వైపు ప్రజాప్రతినిధులు మండలంలోని సమస్యలపై చర్చిస్తుంటే.. అధికారులు నాయకులను బేఖాతరు చేస్తూ చరవాణీల్లో బిజీ అయ్యారు. మరికొంత మంది సమావేశం పట్టించుకోకుండా భోజనానికి ఉపక్రమించారు. దీనిపై ఎంపీడీవోను వివరణ కోరగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పటం కొసమెరుపు.
ఇదీ చూడండి:ఎన్నికలు వాయిదాపై రోజా రెండు మాటలు.... నెట్టింట్లో చక్కర్లు
TAGGED:
Neglence officers