ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్త్రీ విద్యకు బాటలు వేసిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే' - మహాత్మ పూలేకు సీఎం జగన్ నివాళులు

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. స్త్రీ విద్యకు బాటలు వేసిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.

మహాత్మ పూలే జయంతి
mahatma phule birth anniversary

By

Published : Apr 11, 2021, 4:27 PM IST

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ నివాళులు అర్పించారు.

గొప్ప సంఘసంస్కర్త...

అంటరానితనం, కుల వ్యవస్థపై పోరాడిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతి బాపూలే. మహిళలకు విద్యను అందించేందుకు ఆయన చేసిన కృషి మరవలేమని గవర్నర్ బిశ్వభూషణ్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

సంక్షేమ పాలనే లక్ష్యంగా..

అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు. ‘‘ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని’’ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి

'బాబాయి హత్యపై ప్రమాణం చేయాల్సి వస్తుందనే.. సీఎం పర్యటన రద్దు'

ABOUT THE AUTHOR

...view details