ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టులు, మొబైల్ బృందాల్లో పనిచేస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రభుత్వం మంగళం పాడేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధులు నిర్వహిస్తున్న 2వేల156 మందిని.... ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈనెల 31వ తేదీతో వారి సేవలు ముగుస్తాయని...ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలిచ్చారు.
ఆ ఉద్యోగాలకు ప్రభుత్వం మంగళం - ఏపీ వార్తలు
ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రభుత్వం మంగళం పాడేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధులు నిర్వహిస్తున్న 2,156 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిని తొలగించేయటంతో సరిహద్దుల్లో వాహనాల తనిఖీలపై ప్రభావం పడనుంది.
రెండేళ్ల 3 నెలల పాటు వీరితో పనిచేయించుకున్న ప్రభుత్వం.. వారందర్నీ ఉన్న ఫలంగా రోడ్డున పడేసింది. పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా, సుంకం చెల్లించని మద్యం ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు రెండున్నరేళ్ల కిందట రాష్ట్ర సరిహద్దుల్లో ప్రభుత్వం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. మూడు షిఫ్టుల్లో అక్కడ పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన 2,156 మందిని స్పెషల్ ప్రొటక్షన్ ఆఫీసర్లుగా నియమించింది. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేలు చొప్పున వేతనం చెల్లిస్తామని తెలిపింది. 2020 జనవరి నుంచి వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెల వరకూ ప్రభుత్వం వీరికి వేతనాలు చెల్లించలేదు. ఆందోళన చేయటంతో ఇటీవలే ఆ బకాయిలను చెల్లించారు. వేతనాలు సకాలంలో రాకపోయినా ఉద్యోగం ఉందన్న అశతో పనిచేశారు. కాని వారి ఆశలు అడియాశలయ్యాయి. వారందర్నీ ప్రభుత్వం తొలగించింది. వీరిని తొలగించేయటంతో సరిహద్దుల్లో వాహనాల తనిఖీలపై ప్రభావం పడనుంది.
ఇదీ చదవండి:గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి: సీఎం జగన్