రాష్ట్ర పురపాలకశాఖలో పలువురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లకు కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజకీయ జోక్యంతో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఏడుగురికి పదోన్నతి కల్పిస్తే వీరిలో ఇద్దరే బాధ్యతలు చేపట్టారు. మిగిలిన ఐదుగురు తమకు కేటాయించిన పురపాలక సంఘాలకు వెళ్లి వెనక్కి తిరిగొచ్చారు. అక్కడ ప్రస్తుతం పని చేస్తున్న కమిషనర్లు కొందరు ప్రజాప్రతినిధుల అండతో ఆ సీట్లను వదలడం లేదు. తమను ఇక్కడే కొనసాగించాలని తమ ఎమ్మెల్యేలు పురపాలకశాఖ మంత్రికి లేఖలు ఇచ్చారని చెబుతున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఏడుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లకు గ్రేడ్-3 పుర కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ గత నెల 23న పురపాలకశాఖ జీవో ఇచ్చింది. 15 రోజుల వ్యవధిలో వారు బాధ్యతలు తీసుకొని సమాచారం పంపాలి.
పుర కమిషనర్ల పదోన్నతులకు రాజకీయగ్రహణం
రాష్ట్ర పురపాలకశాఖలో పలువురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లకు కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎమ్మెల్యేల కారణంగా అమలుకు నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధుల అండతో కొందరు కమిషనర్లు ఆ సీట్లను వదలడం లేదు.
అయితే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రకాశం జిల్లా చీమకుర్తి కమిషనర్లుగా కేఏ కొండలరావు, ఆర్.వెంకటరామిరెడ్డి మాత్రమే ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట, సూళ్లూరుపేట, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, ప్రకాశం.జిల్లా కనిగిరి, శ్రీకాకుళం జిల్లా రాజాంలలో అక్కడి కమిషనర్లు ఇప్పటికీ రిలీవ్ కాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి బాధ్యతలు చేపట్టడానికి వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. ప్రభుత్వం జీవో విడుదల చేసినా రిలీవ్ అవ్వని కమిషనర్లలో ఎక్కువ మంది పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పుడు ఉన్న క్యాడర్ జీతంపై (ఓన్ పే) కమిషనర్లుగా పని చేస్తున్నారు.
ఇదీ చూడండి:వినూత్న పంటల సాగుతో పలువురు రైతుల స్ఫూర్తి