ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 15, 2021, 9:27 PM IST

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గోపూజోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయాల్లో గోవులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కార్యక్రమం జరిపారు. కనుమ సందర్భంగా గోపూజ ప్రాధాన్యతను భక్తులకు అర్చకులు వివరించారు.

go puja
go puja

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గోపూజోత్సవం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై గోపూజను వైభవంగా నిర్వహించారు. దుర్గగుడి సమీపంలోని గోశాల వద్ద వేద పండితులు....మంత్రాలు చదువుతూ గోవులను పూజించారు. విశాఖ శారదాపీఠంలో కామధేను పూజ ఘనంగా జరిపారు. పీఠం ప్రాంగణంలోని గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సింహాచలం దేవస్థానంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గోపూజ నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

పూజల్లో నేతలు

శ్రీకాకుళం జిల్లా నర్సంపేటలో జరిగిన గోపూజోత్సవంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కనుమ సందర్భంగా గోపూజ నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో వేడుక జరిపారు. కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో గోపూజ ఘనంగా జరిగింది. విజయనగరం తితిదే కల్యాణ మండపంలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా మహోత్సవం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా కామధేను మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. మహానంది ఆలయంలో గోపూజ నిర్వహించారు. కర్నూలులో గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఘనంగా గోపూజ జరిగింది. అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆయంలో గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఆలయాల్లో మంత్రోచ్ఛరణల మధ్య కామధేను మహోత్సవాన్ని ఘనంగా జరిపారు.

ఇదీ చదవండి

సీఎం జగన్ మంచి మనసు... గంగిరెద్దుకు గాయం కాకూడదని..

ABOUT THE AUTHOR

...view details