రాష్ట్రంలోని నిరుపేద కళాకారులను ఆదుకుంటామని పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎందరో కళాకారులకు ఏపీ పుట్టినిల్లు కావడం విశేషమన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఘంటసాల 98వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంగీత ప్రపంచానికి ఘంటసాల రారాజుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. కళలు, కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు.
నిరుపేద కళాకారులను ఆదుకుంటాం: మంత్రి అవంతి
విజయవాడలో జరిగిన ఘంటసాల 98వ జయంతి వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. సంగీత ప్రపంచంలో ఘంటసాల రారాజుగా మిగిలిపోయారని కొనియాడారు. రాష్ట్రంలోని నిరుపేద కళాకారులను ఆదుకుంటామని చెప్పారు.
Gantasala_Jayanthi