విద్యుత్తు డిమాండ్ తగ్గడం.. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు చౌకగా లభిస్తున్న కారణంగా.. జెన్‌కో తన యూనిట్లను బ్యాక్‌డౌన్ (డిస్కంల సూచన మేరకు ఉత్పత్తిని తగ్గించడం) చేసింది. ఫలితంగా... ప్లాంట్లలో 16.5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. లాక్‌డౌన్‌తో విద్యుత్ డిమాండ్ పడిపోయింది. ఆంక్షలు సడలించాక డిమాండ్ 193 ఎంయూలకు చేరినా.. ఉష్ణోగ్రతలు తగ్గిన కారణంగా.. మళ్లీ 168 ఎంయూలకు పడిపోయింది.
మరో వైపు తక్కువ ధరకు మార్కెట్లో విద్యుత్తు లభిస్తున్న కారణంగా... డిస్కంలు అక్కడ కొంటూ జెన్‌కోను ఉత్పత్తి నిలిపివేయాలని సూచించాయి. వేసవిలో విద్యుత్తు డిమాండ్ ఉంటుందని జెన్‌కో జనవరి నుంచే బొగ్గు నిల్వలు పెంచుకుంది. వివిధ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించిన కారమంగా బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా.. కొత్తగా కొనుగోళ్లూ నిలిపివేసింది.