108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని తెదేపా చేస్తున్న ఆరోపణలపై వైకాపా మండిపడింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ చేశారు. పూర్తి పారదర్శకతతోనే 108 వాహనాలు కొనుగోలు చేశామని..ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.
108 వాహనాల కొనుగోళ్లపై బహిరంగ చర్చకు సిద్ధమా.?: శ్రీకాంత్ రెడ్డి
108 వాహనాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ చంద్రబాబు మాట్లాడటం సరికాదని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ధైర్యముంటే తగిన ఆధారాలను బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.
gadikota-srikanth-reddy
చంద్రబాబుకు ధైర్యముంటే టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపించాలని అన్నారు. హైదరాబాద్‌లో ఉండి కరోనా పరీక్షలపై ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏ విషయంలోనైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి:ప్రారంభోత్సవంలోనే.. ప్రమాదం...ఢీకొన్న 108 వాహనాలు..