ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పొట్టిపాడు నుంచి కాజ వరకు! - From Pottipada to Kaja in ap updates

విజయవాడకు తూర్పు వైపు నిర్మించాలనుకుంటున్న మరొక బైపాస్‌కు అధికారులు 4 ప్రతిపాదనలు చేశారు. ఇందులో గన్నవరం అవతల జాతీయ రహదారి-16లోని పొట్టిపాడు నుంచి గుంటూరు వైపు కాజ వరకు 40 కి.మీ.మేర ఉన్న ప్రతిపాదనపై ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆసక్తి చూపుతున్నారు.

From Pottipada
From Pottipada

By

Published : Mar 8, 2021, 10:28 AM IST

విజయవాడకు తూర్పు వైపు నిర్మించాలనుకుంటున్న మరొక బైపాస్‌కు అధికారులు 4 ప్రతిపాదనలు చేశారు. ఇందులో గన్నవరం అవతల జాతీయ రహదారి-16లోని పొట్టిపాడు నుంచి గుంటూరు వైపు కాజ వరకు 40 కి.మీ.మేర ఉన్న ప్రతిపాదనపై ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనికి మద్దూరు వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. మిగిలిన 3 ప్రతిపాదనలకంటే ఇది సరైనదనే అభిప్రాయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల వద్ద వ్యక్తం చేశారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.1,200-1,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణకు రూ.400-500 కోట్లు అవసరం కాగా.. దీన్ని రాష్ట్రమే భరించాల్సి ఉంది.

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ భారాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సీనరేజ్‌ ఫీజు, జీఎస్టీ మినహాయించాలని కేంద్రం కోరగా.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. కొత్త రహదారిలో సీనరేజ్‌, జీఎస్టీ తదితరాలన్నీ మినహాయిస్తే రూ.100 కోట్లు ఎన్‌హెచ్‌ఏఐకి కలిసొస్తాయి. అయితే ఈ ప్రాజెక్టులో భూసేకరణ వ్యయం రూ.500 కోట్ల వరకు ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టుల్లో కూడా సీనరేజ్‌, జీఎస్టీ మినహాయింపులనివ్వాలని కేంద్రం కోరుతున్నట్లు తెలిసింది. ఈ అంశాన్ని రాష్ట్రం పరిశీలిస్తోంది.

రింగ్‌రోడ్డుకు బదులు..

అమరావతి చుట్టూ 180 కి.మీ.మేర రింగ్‌రోడ్డును గతంలోనే మంజూరు చేశారు. దీనికి ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌లు సైతం సిద్ధం చేయగా.. భూమి సేకరించకపోవడంతో ఆ ప్రాజెక్టు అలాగే ఉంది. రింగ్‌రోడ్డులో తూర్పువైపు 78 కి.మీ.ఉంది. దీనికి బదులుగానే కొత్తగా విజయవాడ తూర్పువైపు 40 కి.మీ. బైపాస్‌ నిర్మాణం చేపడతామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే విజయవాడ పశ్చిమం వైపు చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా కాజ వరకు 48 కి.మీ... 6 వరుసల జాతీయ రహదారి (బైపాస్‌) నిర్మాణం జరుగుతోంది.

ఇదీ చదవండి:యుద్ధ రంగంలో శివంగిలా.. యువతకు ఆదర్శంగా

ABOUT THE AUTHOR

...view details