వైకాపా ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై భారం వేసిందని.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు, పింఛన్లు తగ్గిస్తున్నారని మండిపడ్డారు. సీఎంవో నుంచి కింది స్థాయి నేతల వరకూ కియా పరిశ్రమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి ఒత్తిడితో కియా యాజమాన్యం పొరుగు రాష్ట్రాల వైపు చూస్తోందన్నారు. అన్ని దాడులు పూర్తయ్యాయని.. ఇప్పుడు అధికారులపై పడ్డారని ధ్వజమెత్తారు. అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. అమరావతిలో దీక్ష చేస్తున్న వారిపై దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.
కక్షపూరిత పాలనతో వ్యవస్థలను కుప్పకూల్చారు: దేవినేని ఉమ
ముఖ్యమంత్రి జగన్ కక్ష పూరిత పాలనతో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు, పింఛన్లు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒత్తిడితో కియా యాజమాన్యం పొరుగు రాష్ట్రాల వైపు చూస్తోందని అన్నారు.
వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శలు