తెలుగు అకాడమీ(Fixed Deposits Scam In Telugu Academy) కి చెందిన 60 కోట్ల రూపాయలను కాజేసిన వ్యక్తుల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేసిన 60 కోట్ల రూపాయలను (Fixed Deposits Scam In Telugu Academy) చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ.. మరికొందరితో కలిసి కొట్టేసినట్లు వెల్లడించారు. ఏపీ మర్కంటైల్ సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. నగదును యూబీఐ నుంచి నకిలీ ఖాతాల్లోకి మళ్లించి.. నగదు(Fixed Deposits Scam In Telugu Academy) ను విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో యూబీఐ మేనేజర్ మస్తాన్‌వలీని పోలీసులు అరెస్ట్ చేశారు. డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్టు అయ్యారు.
ఎవరెవరికి వాటాలు పంచారు?
కుట్రలో భాగస్వాములైనందుకు ఏపీ మర్కంటైల్ ఛైర్మన్ సత్యనారాయణకు రూ.6 కోట్లు ఇచ్చారు. మిగతా రూ.54 కోట్లను ఎక్కడికి మళ్లించారనే (Fixed Deposits Scam In Telugu Academy) విషయాన్ని సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు. మస్తాన్‌వలీ ఒక్కడే ఈ డబ్బంతా తీసుకున్నారా? లేకపోతే ఎవరెవరికి వాటాలు పంచారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మర్కంటైల్ సొసైటీలోని తెలుగు అకాడమీ ఖాతా నుంచి రూ.60కోట్లను నాలుగు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారు. ఈ నాలుగు ఖాతాలు ఎవరివనే వివరాలు సేకరిస్తున్నారు. మస్తాన్ వలీ కేంద్రంగా గోల్ మాల్ జరిగినందున.. అతన్ని ప్రశ్నిస్తున్న పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. రూ. 60కోట్లలో.. 6 కోట్లు మర్కంటైల్ సొసైటీకి పోను మిగతా రూ.54కోట్లను పంచుకున్నారా? లేకపోతే ఇంకే బ్యాంకులోనైనా డిపాజిట్ చేశారా? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.