ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ జాలర్లను బస్సుల్లో పంపేందుకు ఏర్పాట్లు - ap lock down news

గుజరాత్లో చిక్కుకున్న ఏపీ జాలర్లను రాష్ట్రానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి భాజపా నేతలు తెలిపారు. జాలర్లకు కరోనా పరీక్షలు నిర్వహించి… నెగెటివ్ వచ్చిన వారిని బస్సుల్లో ఏపీకి పంపిస్తామన్నారు.

ఆ జాలర్లను బస్సుల్లో పంపేందుకు ఏర్పాట్లు
ఆ జాలర్లను బస్సుల్లో పంపేందుకు ఏర్పాట్లు

By

Published : Apr 28, 2020, 4:13 PM IST

రాష్ట్రానికి బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న మత్య్సకారులు

గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ జాలర్లను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరావల్‌ జెట్టి తీరంలో చిక్కుకున్న జాలర్లను ప్రైవేట్‌ బస్సుల్లో ఏపీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని… గుజరాత్‌ భాజపా నేతలు తెలిపారు. గుజరాత్‌లో చిక్కుకున్న 5 వేలమందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి స్థానికంగానే వైద్యం అందిస్తామని చెప్పారు. నెగెటివ్‌ వచ్చిన వారిని బస్సుల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. వీరావల్ మత్స్యకారులు ఈ సాయంత్రం బయల్దేరే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details