ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fire accident: హైదరాబాద్​లోని బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం - నానక్‌రామ్‌గూడ గ్రీన్‌ బావర్చి న్యూస్

Fire accident: హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండో అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు వ్యాపించాయి. మంటల ధాటికి హోటల్‌లో నుంచి సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. హోటల్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది.

Fire accident
బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం

By

Published : May 28, 2022, 1:34 PM IST

బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం

Fire accident: హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండో అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు వ్యాపించాయి. యాక్షన్ గార్డింగ్ ప్రైవేట్ లిమిటెండ్ సిబ్బందికి పైన కేటాయించిన కార్యాలయంలోనూ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది.. పోలీసు అధికారులు ఆ ఆఫీసులో ఉన్న వారిని సురక్షితంగా కిందకు తరలించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

మంటల ధాటికి హోటల్‌లో నుంచి సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న కొందర్ని అగ్నిమాపక సిబ్బంది కిందకు దించారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో 15 మంది సిబ్బంది ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నారని హోటల్ యాజమాన్యం తెలిపింది. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బంది పడ్డ సిబ్బందికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. హోటల్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పొగ వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

ABOUT THE AUTHOR

...view details