ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు'.. తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు - సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి ఆరోపణలు

Minister Sabitha Vs Teegala Krishna Reddy: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తెరాస నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. మీర్‌పేట్‌ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు. కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సబితా.. కృష్ణన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు.. ఈ విషయాన్ని మేం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం... ఇది పెద్ద విషయమేమీ కాదని అన్నారు.

Teegala Krishna Reddy
సబితా ఇంద్రారెడ్డిపై కృష్ణా రెడ్డి

By

Published : Jul 5, 2022, 4:40 PM IST

Updated : Jul 5, 2022, 7:13 PM IST

సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చేయలేదన్నారు. మంత్రి సబిత వైఖరిపై సీఎంతో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి.. తెరాస నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా సబిత విజయం సాధించారు. అనంతరం సబితారెడ్డి తెరాస కండువా కప్పుకుని మంత్రి పదవి పొందారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

సబితా ఇంద్రారెడ్డిపై కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డికి చెందిన ఓ వర్గం కొనసాగుతుండగా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డిది మరో వర్గం ఉంది. సబితారెడ్డి తెరాసలో చేరి మంత్రి పదవి పొందటంతో తనకు ప్రాధాన్యం తగ్గిందని తీగల భావిస్తున్నారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి.

స్పందించిన సబితా: తెరాస నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన భూకబ్జాల ఆరోపణలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కబ్జాలు, ఆక్రమణలు జరిగితే.. ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు. తీగల కృష్ణారెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావటంలేదన్న సబిత.. ఈ అంశంపై తీగలతో మాట్లాడతామని వెల్లడించారు.

తీగల కృష్ణారెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావటంలేదన్న సబిత

"మేం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం. ఏ విషయంలో.. ఎవరు కృష్ణారెడ్డిని తప్పుదోవ పట్టించారో తెలియదు. ఒకవేళ నిజంగానే కబ్జాలు జరిగి ఉంటే.. ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఎప్పటికీ కబ్జాలను ప్రోత్సహించదు. కృష్ణన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థంకాలేదు. ఈ విషయాన్ని మేం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. ఇది పెద్ద విషయమేమీ కాదు."-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

ఇవీ చదవండి :

Last Updated : Jul 5, 2022, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details