ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోంది: బొండా ఉమా - తెదేపా నేత బోండా ఉమామహేశ్వరరావు

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్​కు పాల్పడుతూ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు.

Bonda Umamaheswara Rao  allegations on jagan governament
allegations on jagan

By

Published : Aug 15, 2020, 8:34 PM IST

జగన్ ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయాధిపతుల ఫోన్ లు ట్యాప్ చేసే ప్రయత్నం జరిగిందనే వార్తలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడటం వల్లే సీఎం జగన్​మోహన్ రెడ్డి భయపడుతున్నారన్న ఆయన.... ఆ భయంతోనే ఫోన్​లు ట్యాపింగ్​ చేయిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విధ్వంస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details