ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాజకీయ పతనం ప్రారంభమైందని.. రాష్ట్రంలో రాజకీయంగా మార్పు రాబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. మరికొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ కాబోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కుటుంబంలో సీఎం పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.
chintha mohan: 'సీఎం జగన్ రాజకీయ పతనం ప్రారంభమైంది..' - congress comments on cm jagan
మరికొన్ని వారాల్లో ముఖ్యమంత్రి మాజీ కాబోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. బెయిల్ కేసు నుంచి బయటపడేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ex central minister chintha mohan comments on cm jagan
బయటపడేందుకు ఉత్తరాది పారిశ్రామికవేత్త, కేంద్రమంత్రి కుమారుడి సాయాన్ని సీఎం జగన్ కోరుతున్నారని చెప్పారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్‌ను చింతా మోహన్ ఖండించారు. రఘురామకృష్ణరాజుపై కేసులు సమర్థనీయం కాదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కొట్టడం తప్పన్నారు.
ఇదీ చదవండి: