పురపాలక ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. మార్చి 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుందన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. అందుకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం సమన్వయంతో చేస్తోందన్నారు. ప్రజలందరూ కలిసి పురపాలక ఎన్నికలను జయప్రదం చేయాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ముందుగా స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు, సిబ్బంది అందించనున్నారు.
ఓటు వేయడం మన బాధ్యత: ఎస్ఈసీ
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు రమేశ్ కుమార్ తెలిపారు. ఇందు కోసం పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా ఓటును వినియోగించుకోవాలి
Last Updated : Mar 8, 2021, 9:28 AM IST