ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

11 am top ten news
టాప్ టెన్ న్యూస్

By

Published : Mar 28, 2021, 10:59 AM IST

  • ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభం

కర్నూలు విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఓర్వకల్లులో ఉన్న ఎయిర్ పోర్టుకు.. బెంగళూరు విమానం చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మృతులంతా తమిళులే.. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాం'

నెల్లూరు జిల్లా దామరమడుగు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం... డ్రైవర్ నిద్రమత్తు కారణంగా జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారి.. కనిపించని సిబ్బంది!

అనంతపురం జిల్లా మండల కేంద్రంలోని బీసీ వసతి గృహ సిబ్బందిపై.. ఆ శాఖ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక తనీఖీ చేయగా.. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరక్కడ. అంతేగాక రికార్డుల ప్రకారం గృహంలో 120 మంది విద్యార్థులుండగా... 17 మంది మాత్రమే గృహంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో మరో 62,714 కరోనా కేసులు

భారత్​లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 62 వేల మందికిపైగా కొవిడ్​ బారిన పడ్డారు. మరో 312 మంది చనిపోయారు. 28 వేల మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేను గెలిస్తే ప్రతి ఆడపిల్లకు రూ.లక్ష: ఖుష్బూ

తమిళనాడు థౌజండ్ లైట్స్​ నియోజకవర్గం నుంచి తాను శాసనసభ్యురాలిగా గెలిస్తే ప్రతి ఆడపిల్ల ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తానని వాగ్దానం చేశారు భాజపా అభ్యర్థి ఖుష్బూ. శనివారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విమాన అత్యవసర ద్వారం తెరవబోయిన ప్రయాణికుడు!

విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అత్యవస ద్వారం తీయడానికి ప్రయత్నించాడు. అయితే విమాన సిబ్బంది వచ్చి అతన్ని అడ్డుకున్నారు. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ ఘటన దిల్లీనుంచి వారణాసికి వెళుతున్న విమానంలో జరిగింది. విమానంలో 89 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత​

అసోంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్​ బయటపడ్డాయి. సుమారు రూ.12 కోట్లు విలువ చేసే మెథాంఫేటామిన్​ టాబ్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగా పీపుల్స్​ ఫ్రంట్​ కార్యకర్తల నుంచి అధికారులు అక్రమాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'షుక్రియా భారత్​'.. చిన్నారి ముద్దుగొల్పే మాటలు

టీకా పంపిణీ చేస్తున్నందుకు అంతర్జాతీయంగా భారత్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమ దేశానికి టీకా సరఫరా చేసినందకుగానూ ముద్దుముద్దు మాటలతో.. భూటాన్​కు చెందిన ఓ చిన్నారి భారత్​కు కృతజ్ఞతలు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ ఫ్యాన్స్​కు శుభవార్త.. అక్కడి మ్యాచ్​లపై స్పష్టత

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యంలో, అక్కడి జరగబోయే ఐపీఎల్​ మ్యాచ్​లు నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి. ఈ విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫిల్మ్​ఫేర్​ 2021: ఉత్తమ నటీనటులుగా ఇర్ఫాన్​, తాప్సీ

ముంబయిలో 66వ ఫిల్మ్​ఫేర్​ అవార్డుల వేడుక శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా బాలీవుడ్​ హీరోలు రాజ్​కుమార్​ రావ్​, రితీశ్​ దేశ్​ముఖ్​ వ్యవహరించారు. ఇందులో ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్​, ఉత్తమ నటిగా తాప్సీ ఎంపికవ్వగా.. ఉత్తమ చిత్రంగా తాప్సీ నటించిన 'తప్పడ్​' నిలిచింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details