ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 Am - ap top news

.

11am top news
11 Am టాప్ న్యూస్

By

Published : Jun 17, 2020, 10:59 AM IST

  • ఇదే ప్రథమం

అనేకమంది తెలుగు సైనికాధికారులు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయారు. అయితే కల్నల్​‌స్థాయి అధికారి చనిపోవడం మాత్రం ఇదే ప్రథమం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అరెస్టులపై మానవ హక్కుల కమిషన్​కు తెదేపా ఫిర్యాదు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టుల తీరును కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పట్టిసీమ నుంచి నీటి విడుదల

కృష్ణా డెల్టాకు సాగు నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి సాగునీటి కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైద్యానికి 0.18 శాతమే

గత బడ్జెట్‌తో పోలిస్తే వైద్య, ఆరోగ్యశాఖకు ఈసారి కేటాయింపులు 0.18 శాతమే పెరిగాయి. ఈసారి బడ్జెట్లో కేటాయించిన రూ.11,419.48 కోట్లను కిందటేడాది కేటాయింపుతో పోలిస్తే పెరుగుదల స్వల్పమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భగ్గుమన్న భారత్

సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతి చెందడంపై దేశవ్యాప్తంగా సాధారణ ప్రజానీకం సంఘీభావం తెలుపుతోంది. చైనా తీరుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా కలవరం

భారత్​లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతూ పదివేలు దాటింది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,947 కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రపంచ యుద్ధంలో కన్నా కరోనాకే ఎక్కువ మంది బలి

కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 83 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 4.45 లక్షల మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మోటో ఫ్యూజన్ వచ్చేసింది!

బడ్జెట్ సెగ్మెంట్​లో 'ఫ్యూజన్​ ప్లస్' పేరుతో సరికొత్త స్మార్ట్​ఫోన్​ను తీసుకువచ్చింది మోటోరోలా. 6 జీబీ ర్యామ్​ సహా అధిరే ఫీచర్లతో మంగళవారం ఈ మోడల్​ ​ మార్కెట్లోకి విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ సిరీస్ ఎంతో ప్రత్యేకం

భారత్​-పాకిస్థాన్​ మధ్య 1999లో జరిగిన టెస్టు సిరీస్​ తనకు ఎంతో ప్రత్యేకమైందని తాజాగా వెల్లడించాడు పాక్ జట్టు​ మాజీ కెప్టెన్​ వసీం అక్రమ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సిక్స్ ప్యాక్​కు బన్నీనే స్ఫూర్తి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​ను స్ఫూర్తిగా తీసుకునే సిక్స్ ప్యాక్ బాడీ కోసం కష్టపడ్డట్లు తెలిపాడు యువ నటుడు నవదీప్. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. నవదీప్ ఇంకా ఏం చెప్పాడంటే..

ABOUT THE AUTHOR

...view details