ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదల ఆకలి తీరుస్తున్న దాతలు

లాక్​డౌన్​​ కారణంగా పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదవారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి సైతం తోడుగా నిలుస్తున్నారు. కరోనాపై పోరులో అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బందికి అండగా ఉంటున్నారు.

ఆకలి తీరుస్తున్న ఆపన్నులు
ఆకలి తీరుస్తున్న ఆపన్నులు

By

Published : May 1, 2020, 10:23 PM IST


అనంతలో నిరాశ్రయులకు చేయూత...

అనంతపురం జిల్లా నార్పల మండలం గడ్డంనాగేపల్లి, కర్ణపుడి గ్రామాల్లో నార్పల వైస్​ ఎంపీపీ తిప్పన్న 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ఎంఎస్​ రాజుతో కలిసి ఆయన పేదలకు కూరగాయలు అందజేశారు. గుంతకల్లులో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, తెదేపా యువత ఆధ్వర్యంలో మేడే సందర్భంగా హమాలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రెక్క ఆడితే కానీ డొక్కాడని కార్మికులు పట్టణంలో చాలా మంది ఉన్నారని... అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు.

చిత్తూరు జిల్లాలో

పుట్టినరోజు కానుక 200 మందికి అన్నదానం...

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనే ఓ చిన్నారి తన పుట్టినరోజు సందర్భంగా 200మంది పేదలకు అన్నదానం చేసింది. రామచంద్రపురంలో 'సుఖీభవ ఛారిటబుల్ ట్రస్ట్​' ఆధ్వర్యంలో గతనెల రోజులుగా నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదలకు సేవ చేయడం అనందంగా ఉందని ట్రస్ట్​ సభ్యులు తెలిపారు. ప్రత్తిపాడులో వర్తక సంఘాల ఆధ్వర్యంలో నాయిబ్రాహ్మణులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

పుట్టినరోజు కానుక 200 మందికి అన్నదానం

దివ్యాంగుడి ఔదార్యం...

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు ఓ దివ్యాంగుడు లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి రోజూ వందలాది మంది అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు. తన మూడు చక్రాల వాహనంలో పేదలు, యాచకుల వద్దకు వెళ్లి ఆహారం అందిస్తున్నాడు. ఎండను లెక్కయ్యకుండా అతను చేస్తున్న సేవలను పోలీస్​, రెవెన్యూ అధికారులు ప్రశంసిస్తున్నారు. కోడుమూరులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు, వాటర్ మెన్లకు ఎస్టీయూ ఆధ్వర్యంలో పట్టణ సీఐ పార్థసారథి రెడ్డి పండ్లను పంపిణీ చేశారు.

కర్నూలు జిల్లాలో దివ్యాంగుడి ఔదార్యం

మత్స్యకారులకు అండగా వైకాపా నేతలు...

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కండ్రపేటలో ప్రగతి ఫౌండేషన్ ఛైర్మన్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కలిసి మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేశారు. సభాపతి తమ్మినేని సీతారాం సూచనల మేరకు ఆమదాలవలస మున్సిపల్ మాజీ కౌన్సిలర్​ జె.వెంకటేశ్వరరావు, వైకాపా నాయకులతో కలిసి వాటిని మత్స్యకారులకు పంపిణీ చేశారు. కవిటి మండలంలో ఉపాధ్యాయులు రూ.1.10 లక్షలు వెచ్చించి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించారు.

మత్స్యకారులకు అండగా వైకాపా నేతలు

మీడియాకు తోడుగా పోలీసులు...

కరోనా నేపథ్యంలో నిత్యం శ్రమిస్తున్న మీడియా సిబ్బందికి విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆధర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్​ యంత్రాంగం ఎప్పుడూ మీడియాకి తోడుగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

మీడియాకు తోడుగా పోలీసులు

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ...

ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కనిగిరి నగర పంచాయతిలోని 20 వార్డులలోని నిరుపేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. రోజుకు రెండు వార్డుల చొప్పున స్థానిక వాలంటీర్ల సహాయంతో ప్రతి కుటుంబానికి సరకులు పంపిణీ చేస్తున్నారు. నెల్లూరులో 29వ డివిజన్​లో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. డివిజన్ ఇన్​ఛార్జ్​ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో దాదాపు 45 మంది కార్మికులకి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం నూతన వస్త్రాలు బహూకరించి... అన్నదానం చేశారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో

గిరిజనులకు అండగా నిలిచిన సీఆర్‌పీఎఫ్ పోలీసులు..

లాక్‌డౌన్​తో ఇబ్బంది పడుతున్న ఆంధ్ర-ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని గిరిజ‌నుల‌కు సీఆర్‌పీఎఫ్ పోలీసులు తమ వంతు స‌హ‌కారం అందించారు. ఏవోబీలో ఒడిశాకు ఆనుకుని ఉన్న వ‌ల‌స‌గెడ్డ‌, శాండికొరి, బూసుకొండ గ్రామాల్లోని గిరిజ‌నులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వాటితో పాటు శానిటైజ‌ర్లు, మాస్కులు, స‌బ్బులు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని మార్టూరు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేపట్టారు. తెదేపా ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో కలిసి లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు కూరగాయలు అందజేశారు.

గిరిజనులకు అండగా నిలిచిన సీఆర్‌పీఎఫ్ పోలీసులు

చిత్తూరు జిల్లాలో...

చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కుప్పం పర్యటనలో వైకాపా శ్రేణులు జనం భౌతిక దూరాన్ని పాటించక పోవడం విమర్శలకు దారి తీసింది. లాక్​డౌన్​ నేపథ్యంలో కుప్పంలోని రెండు ఆలయాల వేదికగా బ్రాహ్మణులు, నాయిబ్రాహ్మనులకు వైకాపా తరపున నిత్యావసరాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనంతో పాటు పార్టీ శ్రేణులు భౌతిక దూరాన్ని పాటించ కుండా గుంపులు గుంపులుగా కనిపించారు.

చిత్తూరు జిల్లాలో

ఇదీ చూడండి:మేమున్నాం... ఆదుకుంటాం..!

ABOUT THE AUTHOR

...view details