ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hyderabad Casino case: వేగం పుంజుకున్న క్యాసినో కేసు దర్యాప్తు .. మరికొందరికి నోటీసులు - casino case

Hyderabad Casino case: సంచలనంగా మారిని క్యాసినో వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ వ్యాపారాలపై ఈడీ దృష్టి సారించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు ఏడుగురికి నోటీసులు జారీ చేశారు.

casino cheekoti
casino cheekoti

By

Published : Jul 30, 2022, 5:06 PM IST

Hyderabad Casino case: సంచలనంగా మారిని క్యాసినో వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన చీకోటి ప్రవీణ్‌ వ్యాపారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఏడుగురికి నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో నలుగురు హవాలా ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మరోవైపు.. శ్రీలంకలో జరిగిన క్యాసినోలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. ఒక్క టేబుల్‌పై రూ.3 కోట్లు పెట్టి పేకాటరాయుళ్లు జూదం ఆడినట్టు తెలుస్తోంది. పేకాటరాయుళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులున్నట్టు అధికారులు గుర్తించారు. హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇక్కడ నగదు ఇస్తే క్యాసినోలో కాయిన్స్ సమకూరుస్తున్న ప్రవీణ్.. పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖుల్ని తీసుకెళ్లినట్టు గుర్తించారు. ప్రముఖులకు కాల్‌గర్ల్స్‌తో ప్రవీణ్‌ అండ్‌ గ్యాంగ్‌ ఆతిథ్యం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇండోనేషియా, థాయిలాండ్‌లోనూ లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది.

ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

అంతేకాకుండా ఏడాది వ్యవధిలో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లను నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్‌లో ప్రవీణ్ మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించారు. హవాలా మార్గంలో డబ్బులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనికోసం బేగంబజార్, జూబ్లీహిల్స్‌కి చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల సాయం తీసుకున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలో ఈడీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు.

ఇవీ చూడండి..

భారత్​ బోణీ.. వెయిట్​ లిఫ్టింగ్​లో రజతం.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి!

ABOUT THE AUTHOR

...view details