ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Earthquake near srisailam: 'నల్లమల అడవుల్లో భూకంపం.. రాతిపొరల్లో ఒత్తిడితోనే.!'

శ్రీ‌శైలం డ్యామ్ సమీపంలో(Earthquake near srisailam) భూకంపంపై ఎన్జీఆర్‌ఐ(NGRI) శాస్త్రవేత్త నగేశ్‌ వివరణ ఇచ్చారు. రాతి పొరల్లోని ఒత్తిడి కారణంగా భూకంపం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.

earthquake
భూకంపం

By

Published : Jul 26, 2021, 7:29 PM IST

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో భూకంపం వచ్చిందన్న ప్రచారంపై ఎన్జీఆర్​ఐ(నేషనల్​ జియోఫిజికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​) శాస్త్రవేత్త నగేశ్‌ వివరణ ఇచ్చారు. ఉదయం 5 గంటలకు శ్రీ‌శైలం డ్యామ్ దిగువన(Earthquake near srisailam) నల్లమలలో భూకంపం వచ్చినట్లు తెలిపారు. డ్యామ్ వద్ద ఉన్న భూకంప కేంద్రాల్లో తీవ్రత 3.7గా నమోదైనట్లు చెప్పారు.

శ్రీ‌శైలానికి 35 కి.మీ. దూరంలో.. 7 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించనట్లు నగేశ్​ తెలిపారు. భూకంపం కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. రాతి పొర‌ల్లోని ఒత్తిడి కార‌ణంగా భూకంపం వచ్చినట్లుగా భావిస్తున్నామని శాస్త్రవేత్త నగేశ్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details