ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పైసలు సంపాందించడమే హరీశ్​రావు పని:  ధర్మపురి అరవింద్ - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికపై రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఉపఎన్నిక కాస్త భాజపా వర్సెస్ తెరాసగా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావుతో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

పైసలు సంపాందించడమే హరీశ్​రావు పని: ధర్మపురి అరవింద్
పైసలు సంపాందించడమే హరీశ్​రావు పని: ధర్మపురి అరవింద్

By

Published : Oct 29, 2020, 10:37 AM IST

తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెరాస నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా దుబ్బాక అభ్యర్థి రఘునందన్​రావుతో కలిసి సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

హరీశ్ రావు సీఎం దగ్గర గుమాస్తా మాత్రమేనని, మామను చూసి పైసలు సంపాందించడమే ఆయన పని అరవింద్ విమర్శించారు. కేసీఆర్​కు డప్పు కొట్టుకుంటూ తిరగడమే కేటీఆర్, హరీశ్​రావు చేసే పని అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్​ని అరెస్ట్ చేసిన జోయల్​ డేవిస్​ను ఉద్దేశించి ఒక ఎంపీ అంటే ఏమిటో తెలుసుకోవాలన్నారు.

రైతులు ధర్నాలు చేస్తేనే కేసీఆర్ మక్కలు కొంటామంటారని, రైతులందరు అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు. 2009 వరకు కేటీఆర్ ఎవరికీ తెలియదని, సంతోష్​రావు ఎవరో కూడ తెలవదన్నారు. వరిధాన్యం పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేస్తుందని రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ

ABOUT THE AUTHOR

...view details