ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డ్రగ్స్​ స్మగ్లింగ్​లో పట్టుబడ్డ అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​, అరబిక్ టీచర్

drugs tracking హైదరాబాద్​ నగరంలో నిషేధిత డ్రగ్స్​ మాత్రలతో అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​ పట్టుబడ్డాడు. ఈ ఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. నిందితునిపై పలు సెక్షన్​ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

drugs tracking
డ్రగ్స్​ మాత్రలు

By

Published : Aug 27, 2022, 9:55 PM IST

drugs tracking: మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా డ్రగ్స్‌ వినియోగం మాత్రం ఆగడం లేదు. తాజాగా నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపికృష్ణ పట్టుబడ్డ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ ప్లాట్స్​లో చోటుచేసుకుంది.

దొమ్మరాజు గోపికృష్ణ అనే వ్యక్తి నిషేధిత ఎండిఎం ఏ డ్రగ్స్ ను ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 55వేల రూపాయల విలువచేసే పది నిషేధిత డ్రగ్స్ మాత్రలు, ఓ సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు ఎన్​డీపీఎస్​ యాక్ట్ కింద, ఎస్ ఓటి పోలీసులు కేసు‌ నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details