ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Diwali Precautions: దీపావళి రోజు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..! - diwali precautions

వెలుగులు విరజిమ్మే పండుగ దీపావళి. సంబరాల్లో ప్రత్యేకమైన టపాసులను కాల్చడం అందరికీ ఓ సరదా.అయితే.. కరోనాతో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. వేడుకల్లో పాల్గొనేటప్పడు చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరుబయట టపాసులు కాల్చాలని సూచిస్తున్న వైద్యులు... ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

diwali precautions
diwali precautions

By

Published : Nov 4, 2021, 3:56 PM IST

Diwali Precautions: దీపావళి రోజు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

దీపాల పండుగ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుని పిల్లా పాప సందడిగా గడిపే సంబరమే దీపావళి. అలాంటి దీపావళికి దీపాలతోపాటు... టపాసులు అంతే ప్రత్యేకం. అయితే ఈ వెలుగుల పండుగ తర్వాత ఏటా శ్వాస కోశం సంబంధిత వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా కొవిడ్​ బాధితులు టపాసులు కాల్చకపోవడం మంచిదని సూచిస్తున్నారు. దీపావళి వేడుకల సందర్భంగా శ్వాససంబంధిత వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details