ప్రభుత్వ అవినీతిపై గళం వినిపిస్తున్న తెదేపాఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిపై వైకాపా ప్రభుత్వం కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. సీఎం జగన్కు కలలో కూడా అచ్చెన్నాయుడే కనిపిస్తున్నాడని మాజీ మంత్రి దేవినేని ఎద్దేవా చేశారు. కింజరాపు కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభల్లో ఉన్నారని... చంద్రబాబుకు సభలో చేదోడుగా అచ్చెన్నాయుడు ఉంటున్నారన్న అక్కసుతోనే అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు: కళా వెంకట్రావ్
తెదేపాలోని బీసీ నేతలపై జగన్.. మంత్రులతో అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. బీసీ నేత, ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిపై అవినీతి బురద జల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కక్షపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అన్యాయంగా పెడుతున్న కేసులు, ఆరోపణలను ఎదుర్కొంటూనే.. జగన్ ప్రభుత్వ దుష్పరిపాలనను ప్రజాకోర్టులో ఎండగట్టడంలో ముందుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
'బీసీ నేతలు ఎదగడాన్ని జగన్ సహించలేకపోతున్నారు'