గుంటూరు జిల్లా వెలగపూడిలో రాజధాని పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి కార్యాలయం ప్రారంభమైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఐకాస జెండాను ఎగరవేశారు. ఇకపై రాజధానిలో నిర్వహించే కార్యకలాపాలన్నీ ఇక్కడ నుంచే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు.
రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు 3 రాజధానులకు తెరలేపారని ఆయన ఆరోపించారు. రాజధానిలో రూ. 53వేల కోట్ల విలువైన పనులు జరిగాయని అన్నారు. రాజధాని మార్పుపై ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయం కోరాలని డిమాండ్ చేశారు.