ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nagarjuna sagar: ఎగువ నుంచి తగ్గుతున్న ప్రవాహం - తెలంగాణ వార్తలు

కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రవాహం తగ్గుతోంది. గురువారం ఉదయం ఆలమట్టి వద్ద 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా... సాయంత్రానికి 80 వేలకు పడిపోయింది. నాగార్జునసాగర్‌కు రాత్రి 7 గంటల వరకు 2.85 లక్షలు వస్తుండగా... 2.38 లక్షలు దిగువకు విడుదల చేస్తున్నారు.

sager water levels
sager water levels

By

Published : Aug 6, 2021, 8:24 AM IST

కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రవాహం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గురువారం ఉదయం ఆలమట్టి వద్ద 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 80 వేలకు పడిపోయింది. దీంతో దిగువకు కూడా 80 వేలే వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి కూడా దిగువకు నీటి విడుదల తగ్గింది. జూరాలకు 1.71 లక్షలు వస్తుండగా 1.46 లక్షలు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 29 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

శ్రీశైలానికి 1.52 లక్షలు వస్తుండగా ఏపీ, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తితోపాటు స్పిల్‌వే ద్వారా 2.02 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. రాత్రి 7 గంటల వరకు నాగార్జునసాగర్‌కు 2.85 లక్షలు వస్తుండగా డ్యాం నుంచి 16 గేట్లను ఎత్తి 2.38 లక్షలు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద (310.8498 టీఎంసీలు) ఉంది. అలాగే పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో మరమ్మతులకు అనుగుణంగా నీటి మట్టాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. 17 గేట్లు తెరిచి 5.05 లక్షలు దిగువకు విడుదల చేస్తున్నారు.

సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులకు 167.32 అడుగుల వద్ద ఉంది. అంటే నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 34.68 వద్ద ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదను సముద్రం వైపు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: pulichintala dam: ఆనాడే డ్యాం నిర్మాణంపై నిపుణుల అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details