తెదేపా...
సీఎస్ ఆకస్మిక బదీలిపై ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని తెదేపా నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.చెప్పిన పని చేయనందుకే బదిలీ చేసినట్లు భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపై తెదేపా ఎంపీ కేశినేని నాని స్పందించారు.సీఎస్...ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ ఇస్తే...తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎస్‌ను బదిలీ చేశారనిట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యకు సీఎం జగన్ పేరు ట్యాగ్ చేసిన కేశినేని నాని.. కంగ్రాట్యులేషన్స్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య జోడించారు.
భాజపా...
సీఎస్ బదిలీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సీఎస్ బదిలీ పరాకాష్ట అని తెలిపారు.ముఖ్యమంత్రి చెప్పే వాటికీ, చేసేవాటికీ పొంతన లేదని ఆరోపించారు.బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తిని బదిలీ చేయడం నియంతృత్వమేనని పేర్కొన్నారు.