తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. తనపై చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. "నారాయణ భాజపాలో చేరుతున్నారు" అని పువ్వాడ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. "నాలుగు పార్టీలు మారి, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రి అయిన మీరు... నా గురించి మాట్లాడతారా" అని పువ్వాడను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయ అనైతిక చరిత్ర పువ్వాడదని.. స్వచ్ఛమైన చరిత్ర తనదని నారాయణ దుయ్యబట్టారు. తనపైన బుదర చల్లాలని చూస్తే... సూర్యుడిపై ఎంగిలి వేసినట్టు అవుతుందన్నారు.
నేనా.. భాజపాలోకా?: సీపీఐ నారాయణ
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తీరుపై.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తాను భాజపాలో చేరుతున్నానని అంటూ అజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
పువ్వాడ అజేయ్ పై సీపీఐ నారాయణ ఆగ్రహం