ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఎంఎస్​ ద్వారా కరోనా పరీక్ష ఫలితం

కొవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఇకపై సంబంధిత వ్యక్తి నమోదు చేయించుకున్న సెల్​ఫోన్ నంబరుకు సమాచారం రూపంలో నేరుగా అందేలా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

covid confirmation results
covid confirmation results

By

Published : Jun 10, 2020, 3:30 AM IST

కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఇకపై సంబంధిత వ్యక్తి నమోదు చేయించుకున్న సెల్​ఫోన్ నంబరుకు సమాచారం రూపంలో నేరుగా అందుతుంది. వైద్య ఆరోగ్య శాఖ పంపే లింకు ఆధారంగానూ ఫలితాన్ని చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే ఫలితం వచ్చేందుకు ఒకట్రెండు రోజుల వ్యవధి పడుతోంది.

ఫలితాన్ని ఆన్​లైన్ ద్వారా వైద్యులు, సంబంధిత ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు తెలియజేస్తున్నారు. దీని వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. పరీక్షలు చేయించుకున్న వ్యక్తి సెల్​ఫోన్ నంబరుకు ఫలితాన్ని అందజేయడం మంగళవారం నుంచి అమల్లోకి తెస్తున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. దీనివల్ల వైద్య చికిత్సను వెంటనే ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details