సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో దంపతుల ఆత్మహత్యాయత్నం - సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దంపతుల బలవన్మరణ ప్రయత్నం
13:58 May 19
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. తమ ఆర్థిక పరిస్థితిని సీఎంకు తెలిపి.. సహాయం అర్థించేందుకు రాగా పోలీసులు అడ్డుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో దంపతుల ఆత్మహత్యకు యత్నించారు. పెట్రోల్ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకుని తాడేపల్లి పీఎస్‌కు తరలించారు. కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి వాసులు.. తమ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవంటూ సీఎం ఆర్థిక సహాయం కోసం వచ్చారు. కొవిడ్ నిబంధనల కారణంగా అవకాశం లేదని పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతివ్వలేదని.. సురేష్, సరస్వతి బలవన్మరణానికి యత్నించారు.
ఇదీ చదవండి: రఘురామ కేసులో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు ధిక్కరణ నోటీసుల జారీకి ఆదేశం!