ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్ ముందు.. తర్వాత.. గ్రాఫ్ ఇలా పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శనివారం ఏకంగా 491 కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. లాక్‌డౌన్‌ విధించడానికి ముందు రాష్ట్రంలో కేవలం ఎనిమిది కేసులు మాత్రమే ఉండగా.. దేశంలో ఇప్పటివరకు విధించిన లాక్‌డౌన్‌లు, అన్‌లాక్‌ సమయాల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏపీ ప్రభుత్వం ఓ గ్రాఫ్‌ను విడుదల చేసింది.

corona graph in andhrapradesh before lock down and after lock down
corona graph in andhrapradesh before lock down and after lock down

By

Published : Jun 20, 2020, 10:19 PM IST

కొత్తగా నమోదైన 491 కేసులతో.. రాష్ట్రంలో మెుత్తం కేసుల సంఖ్య 8452కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రానికి చెందివారు 6620 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 1506 మంది. ఇక విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారిలో 326 మంది కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,111గా ఉంది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,240 మంది చికిత్స పొందుతున్నారు.

గ్రాఫ్ ఇలా ఉంది..

  1. మార్చి 24 వరకు రాష్ట్రంలో 8 కరోనా కేసులు నమోదు
  2. తొలి విడత లాక్‌డౌన్‌ 21 రోజుల్లో 495 కరోనా కేసులు
  3. రెండో విడత లాక్‌డౌన్‌ 19 రోజుల్లో 1,147 కరోనా కేసులు
  4. మూడో విడత లాక్‌డౌన్‌ 14 రోజుల్లో 782 కరోనా కేసులు
  5. నాలుగో విడత లాక్‌డౌన్‌ 14 రోజుల్లో 1,244 కరోనా కేసులు
  6. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన ఈ 20 రోజుల్లో 4,776 కరోనా కేసులు
ప్రభుత్వం విడుదల చేసిన గ్రాఫ్

ABOUT THE AUTHOR

...view details