ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి గ్రామాలకు చేరుతున్న వారి ద్వారానూ కొవిడ్ విస్తృతమవుతోంది. ప్రస్తుతం(ఈనెల 2నాటికి) రాష్ట్ర వ్యాప్తంగా 396 కట్టడి (క్లస్టర్) ప్రాంతాలు ఉండగా..వీటిలో గ్రామీణ నేపథ్యంతో ఉన్న మండలాలు 207 వరకు ఉండటం గమనార్హం. వైరస్ ఇంకా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదని భావిస్తున్న తరుణంలో ప్రస్తుత కేసుల నమోదు వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. మాస్కుల ప్రాధాన్యాన్ని సరిగా గుర్తించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం తదితర కారణాలతో గ్రామాలలో వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన ఒకరు గుంటూరు మార్కెట్‌లో కూరగాయల వ్యాపారిగా ఉన్నారు. ఆయనకి పాజిటివ్ రావడంతో ఆ గ్రామంలో ఆందోళన నెలకొంది.పల్లెల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
- జిల్లాల వారీగా రూరల్, అర్బన్ కట్టడి ప్రాంతాలు
జిల్లా పేరు | రూరల్ | అర్బన్ |
శ్రీకాకుళం | 1 | 2 |
విజయనగరం | 3 | 1 |
విశాఖపట్నం | 5 | 29 |
తూర్పు గోదావరి | 15 | 19 |
పశ్చిమ గోదావరి | 12 | 16 |
కృష్ణా | 16 | 27 |
గుంటూరు | 21 | 14 |
ప్రకాశం | 13 | 8 |
నెల్లూరు | 34 | 26 |
చిత్తూరు | 28 | 9 |
కడప | 10 | 10 |
అనంతపురం | 14 | 10 |
కర్నూలు 18 | 35 | 18 |